tet: ఎనిమిదో రోజు ఏపీ టెట్ కు 44,080 మంది అభ్య‌ర్థుల‌ హాజరు

  • వివరించిన టెట్ క‌న్వీన‌ర్ ఎ.సుబ్బారెడ్డి
  • లాంగ్వేజెస్ కు సంబంధించి ఎనిమిదో రోజు టెట్
  • హాజరు శాతం 90.50
  • టెట్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ అభ్య‌ర్థులకు సూచనలు

ఎనిమిదో రోజు అన్ని ప‌రీక్షా కేంద్రాల్లో ఏపీ ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష (టెట్) ప్ర‌శాంతంగా జ‌రిగింది. అభ్య‌ర్థుల‌కు ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ముగిసింది. మొత్తం 44,080 మంది ఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యార‌ని టెట్ క‌న్వీన‌ర్ ఎ.సుబ్బారెడ్డి ఈరోజు విడుద‌ల చేసిన ఓ పత్రికా ప్ర‌క‌ట‌నలో  పేర్కొన్నారు. ఈ ప‌రీక్ష‌కు 48,706 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా... హాజరు శాతం 90.50 గా ఉందని చెప్పారు. లాంగ్వేజెస్ కు సంబంధించి ఎనిమిదో రోజు టెట్ జ‌రిగిందని ఆయన వివరించారు.        

టెట్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ అభ్య‌ర్థులకు సూచనలు.. 

టెట్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ అభ్య‌ర్థులు త‌ప్ప‌నిస‌రిగా క్రీడ‌ల్లో తాము సాధించిన ప్ర‌తిభా ప‌త్రాల‌ను ఈ నెల 20లోగా టెట్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాల‌ని టెట్ క‌న్వీన‌ర్ సుబ్బారెడ్డి తెలిపారు. తొలుత 20లోగా ప్రతిభా ప‌త్రాల‌ను అప్ లోడ్ చేయాల‌ని, త‌ద‌నంత‌రం అనుబంధ ప‌త్రాల‌ను ధ్రువీక‌ర‌ణ చేయించి అప్ లోడ్ చేయ‌వచ్చ‌ని ఆయన తెలిపారు.                        

  • Loading...

More Telugu News