sensex: నష్టాలకు బ్రేక్.. భారీగా లాభపడ్డ సెన్సెక్స్
- కొనుగోళ్లకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
- 261 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 10,772 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ
అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు ఉన్నప్పటికీ ఈ రోజు మన స్టాక్ మార్కెట్లు సానుకూలంగానే కొనసాగాయి. వరుస నష్టాల నుంచి బయటపడ్డాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 261 పాయింట్లు లాభపడి 35,547కు పెరిగింది. నిఫ్టీ 62 పాయింట్లు పుంజుకుని 10,772 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
జైకార్ప్ లిమిటెడ్ (12.00%), కేపీఆర్ మిల్స్ (7.17%), రెయిన్ ఇండస్ట్రీస్ (4.98%), వక్రాంగీ లిమిటెడ్ (4.96%), క్వాలిటీ (4.90%).
టాప్ లూజర్స్:
ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (-7.49%), అవంతి ఫీడ్స్ (-6.08%), కార్పొరేషన్ బ్యాంక్ (-4.57%), శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ (-3.65%), టైమ్ టెక్నోప్లాస్ట్ లిమిటెడ్ (-3.65%).