Donald Trump: దిగొచ్చిన ట్రంప్... కఠినాతి కఠిన ఉత్తర్వులు వెనక్కు!

  • ఇకపై తల్లిదండ్రుల వద్దనే బిడ్డలు
  • కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం
  • వలసదారుల కుటుంబాలను కలిపే ప్రాసిక్యూట్ చేస్తామన్న ట్రంప్

అమెరికాలోకి అక్రమంగా వచ్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వారి బిడ్డల నుంచి వేరుచేసి నిర్బంధించాలన్న కఠినాతి కఠినమైన ఉత్తర్వులపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడం, సొంత పార్టీ ప్రజా ప్రతినిధులు సైతం విభేదించడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరుచేసే విధానానికి స్వస్తి పలుకుతూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసిన ఆయన, వలసదారులపై తమ కఠిన వైఖరిని మాత్రం మార్చుకోబోమని, అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చే కుటుంబాలను కలిపి ఉంచే ప్రాసిక్యూట్ చేస్తామని అన్నారు.

అమెరికా సరిహద్దులు ప్రస్తుతం చాలా గట్టిగా ఉన్నాయని, కుటుంబాలను కలిపి ఉంచే విచారణ చేపట్టాలని నిర్ణయించామని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తమ తల్లిదండ్రులకు దూరమైన పిల్లల మనోభావాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కాగా, తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులు అమ్మానాన్నల కోసం ఏడుస్తున్న దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం కావడంతో ట్రంప్ పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News