Andhra Pradesh: ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు.. మరో రెండు రోజులు పాఠశాలలకు సెలవులు
- ఇటీవలే మూడు రోజుల సెలవులు ప్రకటించిన విద్యాశాఖ
- తగ్గని ఎండల తీవ్రత
- ప్రైవేటు స్కూళ్లు తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు
ఆంధ్రప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇటీవలే విద్యాశాఖ.. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా మూడు రోజుల పాటు అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సెలవులు నేటితో ముగుస్తున్నాయి. అయితే, అధిక ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో సెలవులను మరో రెండు రోజులు పొడిగించారు.
తప్పనిసరిగా ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలలు కూడా విద్యార్థులకు సెలవులు ఇవ్వాల్సిందేనని.. ఆదేశాలు లెక్కచేయకుండా తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు చేస్తామని విద్యాశాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో 36 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో పాఠశాలలకు మరో రెండు రోజులు సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.