sensex: వాణిజ్య యుద్ధ భయాలతో.. లాభాల నుంచి నష్టాల్లోకి మార్కెట్లు
- అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయం
- 115 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 10,741 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ
అమెరికా-చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో, ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపారు. దీంతో, నిన్న లాభాలను మూటగట్టుకున్న మార్కెట్లు... నేడు నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 115 పాయింట్లు పతనమై 35,432కి పడిపోయింది. నిఫ్టీ 31 పాయింట్లు కోల్పోయి 10,741 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
వక్రాంగీ లిమిటెడ్ (4.93%), ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ (3.95%), సెంచురీ ప్లైబోర్డ్స్ ఇండియా లిమిటెడ్ (3.93%), బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్ (3.82%), డాక్టర్ లాల్ ప్యాథ్ ల్యాబ్స్ లిమిటెడ్ (3.64%).
టాప్ లూజర్స్:
హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (-6.63%), మార్క్ సన్స్ ఫార్మా (-5.65%), బలరాంపూర్ చీనీ మిల్స్ (-5.40%), జిందాల్ సా లిమిటెడ్ (-5.35%), క్వాలిటీ (-5.00%).