justice: నేడు పదవీవిరమణ చేయనున్న జాస్తి చలమేశ్వర్
- ఏడేళ్ల పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన చలమేశ్వర్
- నిబద్ధత, ముక్కుసూటితనం ఆయన ప్రత్యేకత
- మరో ముగ్గురు న్యాయమూర్తులతో కలసి సుప్రీంకోర్టు పనితీరును ఎండగట్టిన తెలుగు తేజం
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి, తెలుగువారి ఆత్మాభిమానాన్ని దేశవ్యాప్తంగా చాటిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేడు పదవీవిరమణ చేయనున్నారు. ఏడేళ్ల పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన విధులు నిర్వహించారు. వృత్తి పట్ల నిబద్ధత, ముక్కుసూటి తనం ఆయనను ఒక ప్రత్యేక వ్యక్తిగా నిలిపాయి. ఈ ఏడాది జనవరి 12న సుప్రీంకోర్టు పనితీరుపై జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ లతో కలసి ఆయన లేవనెత్తిన ప్రశ్నలు దేశాన్ని కుదిపేశాయి. పెను ప్రకంపనలు సృష్టించాయి. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అంటూ చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంలో ఆయన కూడా సభ్యుడు కావడం గమనార్హం.