Stealing: 75 ఏళ్ల క్రితం చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేసిన వృద్ధుడు!

  • రోడ్డుపై స్టాప్ సైన్ బోర్డ్‌ను చోరీ చేసిన వ్యక్తి
  • 50 డాలర్లు పంపిన అమెరికా వృద్ధుడు
  • పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌కు లేఖ రాసిన వైనం 

టీనేజ్‌లో చేసిన తప్పు ఆయనను ఇంకా వెంటాడుతున్నట్లుంది. దొంగతనం చేశానన్న అపరాధ భావంతో జీవించలేక అమెరికాలోని టెక్సాస్‌లో ఓ 90 ఏళ్ల వృద్ధుడు 75 ఏళ్ల క్రితం చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. మిడ్‌వాలెలోని పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌కు ఆయన తాజాగా ఓ లేఖ రాసి క్షమాపణలు చెబుతూ, తాను చేసిన తప్పుకి ప్రాయశ్చితంగా 50 డాలర్ల నోటును కూడా పంపాడు.

తాను టీనేజ్‌లో ఉన్నప్పుడు రోడ్డుపై స్టాప్‌ సైన్‌ బోర్డ్ ని చోరీ చేశానని చెప్పాడు. తనకు ఇప్పుడు 90 ఏళ్లని, తాను టీనేజ్‌లో ఉన్నప్పుడు చేసిన తప్పులు తనను వెంటాడుతున్నాయని, వాటిని దేవుడు మన్నిస్తాడని ఆశిస్తూ క్షమాపణలు చెబుతున్నానని, తాను నిజంగా పశ్చాత్తాపపడుతున్నానని పేర్కొన్నాడు. కాగా, ఆయన అడ్రస్, వివరాలు అధికారులకు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News