polavaram: ‘పోలవరం’ను ఏపీ ప్రభుత్వం అక్షయపాత్రలా భావిస్తోంది: జీవీఎల్ ఆరోపణలు

  • కేంద్రానికి కనీస వెయిటేజ్ కూడా ఏపీ ఇవ్వడం లేదు
  • ప్రాజెక్టు విషయంలో ఏమాత్రం అవకతవకలు జరిగినా ఊరుకోం
  • రాబోయే రోజుల్లో తాము మరింత అప్రమత్తంగా ఉంటాం

'పోలవరం'ను ఏపీ ప్రభుత్వం అక్షయపాత్రలా భావిస్తోందని జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రానికి కనీస వెయిటేజ్ కూడా ఏపీ ఇవ్వడం లేదని, రాబోయే రోజుల్లో తాము మరింత అప్రమత్తంగా ఉంటామని, ప్రాజెక్టు విషయంలో ఏమాత్రం అవకతవకలు జరిగినా ఊరుకోమని హెచ్చరించారు. గుజరాత్ లో ఇరిగేషన్ పై మోదీ ఏ విధంగానైతే శ్రద్ధ పెట్టారో, ఏపీపై కూడా అంతే శ్రద్ధ పెట్టారని అన్నారు.

కాగా, బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని, ఏవైనా సమస్యలు ఉంటే తమకు తెలియజేయాలని, సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని అన్నారు. మరో నేత సోము వీర్రాజు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్ర ప్రభుత్వం నిధులతోనే కడుతున్నారని, కనీసం ప్రాజెక్టుకు సంబంధించిన వెబ్ సైట్లో కానీ, పుస్తకాల్లో కానీ ఎక్కడా మోదీ ఫొటో పెట్టలేదని విమర్శించారు. ల్యాండ్ అక్విజిషన్ వివరాలు వెబ్ సైట్ లో ఎందుకు పెట్టలేదని, చేసిన వ్యయం మినహాయించి మిగిలిన మొత్తం చూపించకుండా, టోటల్ కాస్ట్ ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News