sensex: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- వాణిజ్య యుద్ధ భయాలతో సాగిన మార్కెట్లు
- 219 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 10,762 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ
అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడం, ఇతర దేశాలతో అమెరికా వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో... దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను చవి చూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 219 పాయింట్లు పతనమై 35,470కి పడిపోయింది. నిఫ్టీ 59 పాయింట్లు కోల్పోయి 10,762కు దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ (14.19), కేఈసీ ఇంటర్నేషనల్ (5.06), వక్రాంగీ (4.95), పేజ్ ఇండస్ట్రీస్ (4.55), టీటీకే ప్రిస్టేజ్ (3.28).
టాప్ లూజర్స్:
అలహాబాద్ బ్యాంక్ (8.02), ఐడియా సెల్యులార్ (7.18), టాటా మోటార్స్ (5.94), హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ (5.51), ఏజీస్ లాజిస్టిక్స్ (5.28).