tamilnadu: తమిళనాడులో తవ్వకాల్లో భారీఎత్తున బయటపడ్డ ఏకే 47లు, బుల్లెట్లు, బాంబులు!

  • తమిళనాడులోని రామేశ్వరం సముద్ర తీరంలో బయటపడ్డ డంప్
  • చెత్తను పూడ్చేందుకు గొయ్యి తవ్వుతుండగా వెలుగుచూసిన వైనం
  • 5వేల బుల్లెట్లు, వందల కేజీల మందుగుండు సామగ్రి లభ్యం

తమిళనాడులోని రామాంతపురం జిల్లా రామేశ్వరం సముద్ర తీరంలో ఓ నిర్మాణం కోసం తవ్వకాలు జరపగా... ఒళ్లు జలదరించే వస్తువులు బయటపడ్డాయి. ఏకే47 తుపాకులు, బుల్లెట్లు, బాంబులు, మందుగుండు సామాగ్రి ఉన్న భారీ పెట్టెలు లభించాయి. ఈ ఆయుధ డంప్ ఎల్టీటీఈకి సంబంధించిందని అధికారులు తెలిపారు.

సముద్ర తీరంలో ఓ మత్స్యకారుడి ఇంటివద్ద ఉన్న కొబ్బరి తోటలో... చెత్తను పూడ్చేందుకు గొయ్యిని తవ్వారు. ఐదడుగుల లోతు తవ్వేసరికి ఆయుధాలతో కూడిన పెట్టెలు బయటపడ్డాయి. లోపల ఏముందో అని ఆసక్తితో తెరిచి చూడగా... కళ్లు బైర్లు కమ్మేవిధంగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి బయటపడ్డాయి. దీంతో, కంగారుపడ్డ స్థానికులు వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. రాత్రంతా శ్రమించిన పోలీసులు వాటిని బయటకు తీశారు.

సుమారు 5వేల బుల్లెట్లతో పాటు, వందల కేజీల మందుగుండు సామగ్రి బయటపడటంతో పోలీసులు సైతం విస్తుపోయారు. ప్రస్తుతం ఇవన్నీ తుప్పు పట్టిన స్థితిలో ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు. జిల్లా ఎస్పీ ఓంప్రకాశ్ మీనా మాట్లాడుతూ, 1983-90ల మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని శిక్షణా కేంద్రంగా ఎల్టీటీఈ వాడుకుని ఉండవచ్చని తెలిపారు.

  • Loading...

More Telugu News