stock market: ఆయిల్ కంపెనీలపై అమెరికా ఎఫెక్ట్.. భారీగా నష్టపోయిన సెన్సెక్స్

  • 273 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 98 పాయింట్లు పతనమైన నిఫ్టీ
  • 10 శాతం పైగా నష్టపోయిన జైప్రకాశ్ అసోసియేట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్

ఇరాన్ నుంచి చమురు దిగుమతులను ఆపేయాలంటూ భారత్ ను అమెరికా కోరడం... ఆయిల్ కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీనికి తోడు, డెరివేటివ్ కాంట్రాక్టులు ముగుస్తున్న నేపథ్యంలో, ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో, దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 273 పాయింట్లు పతనమై 35,217కు పడిపోయింది. నిఫ్టీ 98 పాయింట్లు కోల్పోయి 10,671కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఈఐడీ ప్యారీ ఇండియా లిమిటెడ్ (7.44%), ఎంఫాసిస్ (6.00%), వక్రాంగీ (4.93%), టీఐ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ (4.34%), సియెంట్ లిమిటెడ్ (4.28%).  
 
టాప్ లూజర్స్:
జైప్రకాశ్ అసోసియేట్స్ (-10.95%), అదానీ ఎంటర్ ప్రైజెస్ (-10.66%), సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ (-8.40%), భారత్ పెట్రోలియం (-8.04%), ఎన్బీసీసీ (-7.63%).       

  • Loading...

More Telugu News