ramana deekshitulu: రమణ దీక్షితులు నివాసంలో పెంపుడు శునకాలు.. సరికొత్త వివాదం!
- తిరుమలలోని రమణ దీక్షితులు నివాసంలో శునకాలు
- ఆగమ శాస్త్రానికి విరుద్ధమన్న టీటీడీ ఆగమ సలహాదారుడు
- తిరుమల కొండపై కుక్కలను ఎప్పుడో నిషేధించారన్న సుందరవదన భట్టాచార్యులు
తిరుమల వెంకన్న నగలకు సంబంధించిన వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు... తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. తిరుమలలోని ఆయన నివాసంలో పెంపుడు కుక్కలు లభ్యం కావడం ఇప్పుడు వివాదాస్పదమయింది. కుక్కలను పెంచడం ఆగమ శాస్త్రానికి విరుద్ధమని, అపవిత్రమని టీటీడీ ఆగమ సలహాదారుడు సుందరవదన భట్టాచార్యులు తప్పుబట్టారు. స్వామివారి వాహన సేవల్లో శునకం లేదని ఆయన చెప్పారు. ఆలయంలోకి శునకం ప్రవేశించినా... సంప్రోక్షణ చేస్తారని తెలిపారు. ఆలయ ద్వారాన్ని శునకం దాటడం శాస్త్ర విరుద్ధమని... తిరుమల కొండపై కుక్కలను ఎప్పుడో నిషేధించారని చెప్పారు. దీనిపై, రమణ దీక్షితులు ఇంకా స్పందించాల్సి ఉంది.