janasena: పవన్ సమక్షంలో.. 'జనసేన'లో చేరిన టీమిండియా మాజీ క్రికెటర్ వేణుగోపాలరావు!

  • సాదరంగా ఆహ్వానించిన పవన్ కల్యాణ్
  • ఇండియా తరపున 16 వన్టేలు ఆడిన వేణు 
  • 2019లో అధికారం తమదే అన్న పవన్ 

జనసేన పార్టీలోకి సెలబ్రిటీల చేరిక ప్రారంభమైంది. పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్న తరుణంలో... పార్టీ సభ్యత్వం తీసుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా భారత క్రికెట్ మాజీ ప్లేయర్ వేణుగోపాల్ రావు జనసేన పార్టీలో చేరారు. విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేనలో చేరారు. పార్టీలోకి వేణును పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానించారు. ఇదే సమయంలో భారీ సంఖ్యలో అభిమానులు కూడా పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, సుదీర్ఘకాలం పాటు ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా జనసేన పని చేస్తోందని చెప్పారు. 2019లో జనసేన అధికారంలోకి వచ్చి తీరుతుందని తెలిపారు.

ఇకపోతే, 2005లో భారత్ తరపున ఆరంగేట్రం చేసిన వేణుగోపాలరావు మొత్తం 16 వన్డేలు ఆడారు. మొత్తం 218 పరుగులు చేశారు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్ డెవిల్స్, డెక్కన్ ఛార్జర్స్ కు ప్రాతినిధ్యం వహించారు.

  • Loading...

More Telugu News