sensex: కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ భయాలు.. ఈ రోజు కూడా నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!
- అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు
- 179 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 10,589కి పడిపోయిన నిఫ్టీ
అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా పతనమయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 179 పాయింట్లు పతనమై 35,038కి పడిపోయింది. నిఫ్టీ 82 పాయింట్లు కోల్పోయి 10,589కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ (10.87%), జైప్రకాశ్ అసోసియేట్స్ (4.98%), వక్రాంగీ (4.94%), స్ట్రైడ్స్ షాసూన్ లిమిటెడ్ (4.82%), శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ (4.61%).
టాప్ లూజర్స్:
జైన్ ఇరిగేషన్ (-7.95%), అవంతి ఫీడ్స్ (-7.41%), టెక్ మహీంద్రా (-6.82%), ఎన్ హెచ్పీసీ (-6.63%), టాటా స్పాంజ్ ఐరన్ (-6.16%).