suicide: హైదరాబాద్లో తొమ్మిదో అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య
- మాదాపూర్లో ఘటన
- బాల్కనీలోకి వచ్చి దూకిన ఉద్యోగిని
- మానసిక ఒత్తిడే కారణం?
హైదరాబాద్లోని మాదాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. తొమ్మిదో అంతస్తు నుంచి దూకి ఓ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మాదాపూర్ లోని మిలాంజ్ టవర్ ప్రైమ్ ఎరా మెడికల్ టెక్నాలజీలో పనిచేస్తోంది. తొమ్మిదో అంతస్తులో ఉన్న ఆ కార్యాలయానికి రోజులాగే ఈరోజు కూడా వచ్చింది. అయితే, కార్యాలయానికి వచ్చిన కొద్దిసేపటికే బాల్కనీలోకి వచ్చి అక్కడి నుంచి దూకింది. ఆమె గత కొంత కాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.