whatsapp: వాట్సాప్ లో అడ్మిన్ చేతుల్లోనే సర్వాధికారాలు... అందరికీ అందుబాటులోకి వచ్చిన ఫీచర్

  • అన్ని రకాల ఓఎస్ వెర్షన్లపై సెండ్ మెస్సేజెస్ ఫీచర్
  • అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్
  • అడ్మిన్లే పోస్ట్ చేయాలా? లేక సభ్యులు ఎవరైనా చేయచ్చా? అన్నది అడ్మిన్ల చేతుల్లోనే

‘సెండ్ మెస్సేజెస్’ ఫీచర్ ను ఆండ్రాయిడ్, ఐవోఎస్, విండోస్ ఫోన్లలోకి అందుబాటులోకి తెచ్చినట్టు వాట్సాప్ ప్రకటించింది. ఈ ఫీచర్ అడ్మిన్ కు సర్వాధికారాలు కల్పిస్తుంది. గ్రూపు సభ్యులు తమంతట తాము గ్రూపులో మెస్సేజ్ లు చేయకుండా అడ్మిన్ నియంత్రించగలరు. కొన్ని నెలలుగా ఈ ఫీచర్ ను డెవలప్ చేసిన వాట్సాప్ ఇప్పుడు యూజర్లు అందరికీ అందుబాటులోకి తెచ్చింది.

గ్రూపు అడ్మినిస్ట్రేటర్లు గ్రూపు ఇన్ఫోలో, గ్రూపు సెట్టింగ్స్ లోకి వెళ్లి సెండ్ మెస్సేజ్ ఫీచర్ ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఓన్లీ అడ్మిన్స్ (అడ్మిన్లు మాత్రమే) అని, ఆల్ పార్టిసిపెంట్స్ (సభ్యులు అందరూ) అని రెండు ఉంటాయి. ఒకవేళ ఓన్లీ అడ్మిన్ సెలక్ట్ చేసుకుంటే అడ్మిన్లే పోస్ట్ చేయగలరు. సభ్యులకు అవకాశం ఉండదు. అంతేకాదు, ఈ ఫీచర్ సెట్ చేసిన వెంటనే వాట్సాప్ గ్రూపు సభ్యులకు వారిక మెస్సేజ్ లు, ఫొటోలు ఇతరత్రా పోస్ట్ చేయలేరని సందేశం వెళుతుంది.

  • Loading...

More Telugu News