Telangana: తెలంగాణాలో భారీ వర్షాలకు సమయం వచ్చింది!
- తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
- జూలై మొదటి వారంలో కురుస్తాయంటున్న వాతావరణ శాఖ
- ఉపరితల ఆవర్తనానికి తోడు కానున్న రుతుపవనాలు
తెలంగాణ వ్యాప్తంగా జూలై మొదటి వారంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల ప్రారంభంలోనే రుతుపవనాలు రాష్ట్రానికి వచ్చినా, ఆపై బంగాళాఖాతంలో అల్పపీడనాలు లేక, బలహీనపడ్డాయన్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్ తో పాటు మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఆశించినంత మేర వర్షాలు కూడా కురవలేదు. ఇక తాజాగా పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా చత్తీస్ గఢ్ ల మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రుతుపవనాలు విస్తరించి మంచి వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.