new york times: న్యూయార్క్ టైమ్స్ పత్రికలో చంద్రబాబుపై ప్రత్యేక కథనం.. ప్రశంసలు!
- వ్యవసాయాన్ని ప్రకృతికి చేరువ చేయాలంటూ కథనం
- కథనంలో ఏపీ గురించి ప్రస్తావన
- జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ పై ప్రశంసలు
ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ పై ప్రముఖ పత్రిక 'న్యూయార్క్ టైమ్స్' లో కథనం వచ్చింది. రసాయన రహిత వ్యవసాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషిని తన కథనంలో ప్రశంసించింది. ఇండియాలోనే మొట్టమొదటి జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ రాష్ట్రం అంటూ కితాబునిచ్చింది.
వ్యవసాయాన్ని ప్రకృతికి చేరువ చేయాలంటూ ప్రచురించిన కథనంలో ఈ మేరకు ఏపీ గురించి ప్రస్తావించింది. ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం కోసం ఏపీ ప్రభుత్వం సుమారు రూ. 2500 కోట్లు వెచ్చిస్తోందంటూ కథనంలో పేర్కొంది. ఈ ఏడాది చివర కల్లా 5 లక్షల మంది రైతులు సేంద్రీయ వ్యవసాయం పట్ల మొగ్గు చూపే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే ఐదేళ్లలో 60 లక్షల మంది రైతులు ఇదే తరహాలో వ్యవసాయం చేసే అవకాశం ఉందని పేర్కొంది.