Pawan Kalyan: ఐటీ సంస్థలకు ఇంత పెద్ద మొత్తంలో స్థలాలు ఎందుకు కేటాయించారు?: పవన్ కల్యాణ్
- విశాఖ మధురవాడలోని స్థలాలను పరిశీలించిన పవన్ కల్యాణ్
- ఎక్కువ ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని డిమాండ్
- స్థానికేతరులకు ఉద్యోగాలు ఇవ్వడం వల్లనే ప్రాంతీయ భేదాలు వస్తున్నాయి
విశాఖపట్టణంలోని మధురవాడలో సర్వే నంబర్ 336 కొండపై వివిధ ఐటీ శాఖలకు ఏపీ ప్రభుత్వం స్థలాలను కేటాయించింది. ఈ స్థలాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక్కడ నెలకొల్పుతున్న స్థలాల్లో ఎక్కువ ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
స్థానికులకు అవకాశాలు ఇవ్వకుండా, స్థానికేతరులకు ఉద్యోగాలు ఇస్తుండటం వల్లనే ప్రాంతీయ భేదాలు వస్తున్నాయని అన్నారు. విదేశాల్లో తక్కువ స్థలాల్లోనే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్న కంపెనీలకు... ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో స్థలాలను కేటాయించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. విశాఖ నగరంలో అన్ని అంశాల్లో స్థానికులకే పెద్ద పీట వేయాలని చెప్పారు.