India: ఇక నాకు ఎంత తలనొప్పో..: విరాట్ కోహ్లీ
- ఐర్లాండ్ తో రెండు మ్యాచ్ ల్లోనూ విజయం
- రాణించిన ఆటగాళ్లు
- తదుపరి మ్యాచ్ కి ఎవరిని తీసుకోవాలన్న సమస్య
- రిజర్వ్ బెంచ్ బలంగా ఉందన్న విరాట్
ఐర్లాండ్ తో ఆడిన రెండు క్రికెట్ మ్యాచ్ ల్లోనూ ఘనవిజయం సాధించిన టీమిండియాలో ఆటగాళ్లంతా రాణించడంతో తదుపరి ఇంగ్లండ్ సిరీస్ లో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలన్న సమస్య మేనేజ్ మెంట్ కు ఎదురైంది. రెండు గేముల్లో అన్ని విభాగాల్లో రాణించడంతో జట్టులో సమతుల్యత కనిపిస్తోందని వ్యాఖ్యానించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, తనకు ఓ పెద్ద సమస్య వచ్చిందని, తదుపరి గేమ్ లకు ఎవరిని తీసుకోవాలో, ఎవరిని పక్కనబెట్టాలో తెలియడం లేదని, ఇది తనకు తలనొప్పిగా మారిందని వ్యాఖ్యానించాడు.
తొలి మ్యాచ్ ఆడిన జట్టులో నలుగురిని పక్కనబెట్టి, మరో నలుగురికి అవకాశం ఇవ్వగా వారు తమకు అందివచ్చిన అవకాశాన్ని వాడుకుని రాణించారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన విరాట్, ఆటగాళ్ల ప్రదర్శన తనకు సంతోషాన్ని కలిగిస్తోందని, రిజర్వ్ బెంచ్ సైతం బలంగా ఉందని అన్నాడు. ఇంగ్లండ్ పిచ్ లతో జట్టుకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని భావిస్తున్నట్టు చెప్పాడు.