Stock Market: నష్టాలలో స్టాక్ మార్కెట్లు.. 159 పాయింట్లు పడిన సెన్సెక్స్!
- ఆరంభం నుంచి ఒడిదుడుకులే!
- అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం
- 57 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
ఈ రోజు ఆరంభం నుంచి ఒడిదుడుకులతో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు క్లోజింగ్ సమయానికి నష్టాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 159 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 57 పాయింట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ఓపక్క వాణిజ్య యుద్ధ భయాలు.. మరోపక్క జర్మనీలో రాజకీయ అనిశ్చితి కారణంగా అంతర్జాతీయంగా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై కూడా కనిపించడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో మార్కెట్ల సూచీలు దిగజారాయి. ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, టైటాన్, బజాజ్ ఆటో షేర్లు లాభాలు ఆర్జించాయి. ఇక అదానీ పోర్ట్స్, హిండాల్కో, ఎయిర్ టెల్, ఎన్టీపీసీ తదితర షేర్లు నష్టాల బాటపట్టాయి.