whatsapp: వాట్సప్‌లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే కఠిన చర్యలే అంటున్న కేంద్రం!
- తప్పుడు సమాచారంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు
- కేంద్ర హోంశాఖ హెచ్చరికలు
- ప్యానెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి
వాట్సప్‌లో వస్తోన్న తప్పుడు వార్తలు, వీడియోల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటోన్న విషయం తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పిల్లల్ని ఎత్తుకెళుతున్నారన్న వదంతులతో పాటు పలు తప్పుడు ప్రచారాల కారణంగా అమాయకులను కొట్టి హత్య చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇటువంటి వదంతులు వ్యాప్తి చేస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటువంటి వారిని గుర్తించేందుకు హోం శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.