bigg boss: తమిళ బిగ్‌బాస్ షో అశ్లీలకరంగా నడుస్తోందని.. టీవీ ఆఫీస్‌ను ముట్టడించేందుకు హిందూ సంఘాల యత్నం
- కమల హాసన్, విజయ్ టీవీకి వ్యతిరేకంగా ధర్నా
- అడ్డుకున్న పోలీసులు
- ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్న హిందూ సంఘాలు
బిగ్‌బాస్ షో అశ్లీలకరంగా నడుస్తోందంటూ ఆ షో తమిళ వర్షన్ ప్రసారమయ్యే విజయ్ టీవీ ఆఫీస్‌ను ముట్టడించేందుకు హిందూ సంఘాలు యత్నించాయి. ఆ షో వ్యాఖ్యాత కమల హాసన్‌తో పాటు విజయ్ టీవీకి వ్యతిరేకంగా చెన్నయ్‌లో ఆ సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. ఆ షోను నిషేధించకపోతే తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హిందూ సంఘాల నాయకులు హెచ్చరించారు. పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించేలా బిగ్‌బాస్ ఉందని మండిపడ్డారు.