BJP: బెదిరిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ఆ ఆడబిడ్డ 'ఎస్ అంకుల్.. ఎస్ అంకుల్' అంటుంటే బాధేసింది!: రాంమాధవ్

  • రాష్ట్రంలో బెదిరింపుల పాలన
  • ఇక్కడి ఎమ్మెల్యేలకు మగతనం లేదా 
  • నిజాం పాలన లాంటి నియంతృత్వపు పాలన నడుస్తోంది 

వరంగల్ జిల్లా హన్మకొండలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో మాట్లాడిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ తాజాగా జరిగిన ఓ ఘటన గురించి ఆవేశంగా చెప్పుకొచ్చారు.  

"ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓ కౌన్సిలర్ కూతుర్ని ఫోన్లో బెదిరిస్తున్నాడు. చిన్న పిల్ల .. ఆడకూతురు .. 'ఎస్ అంకుల్, ఎస్ అంకుల్' అంటోంది.. ఈయన బెదిరిస్తున్నాడు.. ఏమనీ.. 'చూడు, మీ నాన్నకు చెప్పు, మా మాట వినకపోతే బస్తీ మొత్తం లేపేస్తాం.. ఏమనుకుంటున్నావ్.. కేసీఆర్ గారంటే.. కేసీఆర్ గారు తలచుకుంటే అందరూ ట్రాన్స్ ఫర్ అయిపోతారు. కేసీఆర్ గారు తలచుకుంటే మీ కాలనీ మొత్తం జైలుకి వెళ్లిపోతుంది..' అంటూ చిన్న పిల్లని బెదిరిస్తున్నాడు .. నేను రోజూ తెలంగాణలో ఉండను. దూరం నుంచి వచ్చిన నాకే బాధేస్తోందే. ఇక్కడ ఎమ్మెల్యేలు మగతనం లేనివాళ్లా? ఆడపిల్లల్ని పట్టుకుని ఫోన్లో బెదిరిస్తారా? ఇక్కడ నిజాం పాలన లాంటి నియంతృత్వపు వంశపాలన నడుస్తోంది.." అంటూ  రాంమాధవ్ నిప్పులు చెరిగారు.  

  • Loading...

More Telugu News