jagan: ఆ మూడు పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు!: దేవినేని ఉమామహేశ్వరరావు

  • ఈ మూడు పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు
  • మేం ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే..అడ్డుపడుతున్నారు
  • మద్దతు ధరపై రాష్ట్రాల ప్రతిపాదనలను కేంద్రం పట్టించుకోలేదు

బీజేపీతో కుమ్మక్కైన వైసీపీ, జనసేన పార్టీలు తమపై విమర్శలు చేస్తున్నాయని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ మూడు పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మేం ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే.. కేసులు వేసి అడ్డుపడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ హయాంలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేశారని, ప్రాజెక్టులు పూర్తి చేయలేదని విమర్శించారు.

కాగా, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, పంటల మద్దతు ధరపై రాష్ట్రాల ప్రతిపాదనలను కేంద్రం పట్టించుకోలేదని, కూలీ ఖర్చులు, పెట్టుబడిపై వడ్డీని పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను కేంద్రం పక్కన పెట్టేసిందని, గత నాలుగేళ్లలో పంటల కొనుగోళ్ల కోసం ఏపీ ప్రభుత్వం రూ.2662 కోట్లు ఖర్చు చేస్తే, కేంద్రం మాత్రం రూ.1180 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు.

ప్రధాని మోదీ కేవలం మాటలకే పరిమితమయ్యారని, ఇవేవీ జగన్, పవన్ కళ్లకు కనబడడం లేదా? ‘హోదా’ ఇవ్వలేమని కేంద్రం అఫిడవిట్ ఇస్తే నిలదీసేది చంద్రబాబునా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబును విమర్శించడమే వైసీపీ ఏకైక అజెండాగా ఉందని సోమిరెడ్డి మండిపడ్డారు.

  • Loading...

More Telugu News