Noida: నొయిడాలో శాంసంగ్ అతిపెద్ద మొబైల్ తయారీ యూనిట్.. ప్రారంభించిన మోదీ

  • నొయిడాలో అతిపెద్ద మొబైల్ ఫ్యాక్టరీ
  • దక్షిణ కొరియా అధ్యక్షుడితో కలిసి ప్రారంభించిన మోదీ
  • ఇక చైనా కంపెనీలకు చుక్కలే

దక్షిణ కొరియాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ నొయిడాలో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. భారత ప్రధాని నరేంద్రమోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ కలిసి ప్రారంభించారు. శాంసంగ్ ఇప్పటికే భారత్‌‌లో మొబైల్స్‌ను అసెంబుల్ చేస్తోంది. చైనా మొబైల్ మేకర్స్ నుంచి శాంసంగ్‌కు విపరీతమైన పోటీ ఎదురవుతోంది. భారత మొబైల్ మార్కెట్‌పై చైనా కంపెనీలు పెత్తనం సాగిస్తున్నాయి. దీంతో వాటికి ఎదురొడ్డి మార్కెట్లోని గణనీయమైన వాటాను సొంతం చేసుకునేందుకు శాంసంగ్ ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే నొయిడా ప్లాంట్‌ను విస్తరించింది. మొబైళ్లను స్థానికంగా తయారు చేయడం వల్ల ధరలు గణనీయంగా తగ్గి చైనా కంపెనీలకు పోటీ ఇవ్వవచ్చనేది శాంసంగ్ భావన.

నొయిడా ప్లాంట్ ద్వారా ‘ఇండియా మేడ్’ ఫోన్లను ఎగుమతి చేయాలని శాంసంగ్ ప్రణాళికలు రూపొందిస్తోంది. వచ్చే మూడేళ్లలో నొయిడా ప్లాంట్‌ను విస్తరించేందుకు రూ.49.2 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు శాంసంగ్ గతేడాదే ప్రకటించింది. తాజాగా అందుబా‌టులోని ప్లాంట్ వల్ల మొబైల్ ఉత్పత్తి సామర్థ్యం రెండింతలకు పెరిగిందని శాంసంగ్ తెలిపింది.

  • Loading...

More Telugu News