Rains: భారీ వర్షాల ఎఫెక్ట్... ఆగిన డబ్బావాలా సేవలు!

  • 24 గంటల వ్యవధిలో 10 సెం.మీ. వర్షం
  • మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
  • పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 10 సెంటీమీటర్లకు మించిన వర్షం కురవగా, ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. నగర తూర్పు ప్రాంతంలో 10.7 సెం.మీ., పశ్చిమ ప్రాంతంలో 13.1 సెం.మీ. వర్షం కురిసింది. మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించిన తరువాత సెలవులను పొడిగించవచ్చని అధికారులు అంటున్నారు.

 ఇక ముంబైలో లక్షలాది మంది ఉద్యోగులకు వేడివేడిగా ఇంటి భోజనాన్ని అందించే 'డబ్బావాలా' సేవలు వర్షం కారణంగా నిలిచిపోయాయి. లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తూ ఉండటం, వర్షాలతో నిండిపోయిన రహదారులపై కస్టమర్ల ఇంటికి వెళ్లి లంచ్ బాక్స్ లు తీసుకోవడం కష్టమైన నేపథ్యంలో నేడు తమ సర్వీస్ లను నిలిపివేస్తున్నట్టు డబ్బావాలా సంఘ నేతలు ప్రకటించారు.

  • Loading...

More Telugu News