Renu Desai: రేణూ దేశాయ్ విడాకులు, అన్నా లెజినోవాకు పాప పుట్టిన తేదీలపై 'రేణు పీఆర్' టీమ్ వివరణ!
- దుమారం రేపిన రేణు ఇంటర్వ్యూ
- 2012 మార్చి 13న పుట్టిన పోలినా
- 2012 మార్చి 16న రేణుకు విడాకులు
రేణూ దేశాయ్ నియమించుకున్న పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) టీమ్ తాజాగా ఆమె విడాకులకు సంబంధించిన తేదీపై వివరణ ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన రేణు, అందులో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుండగా, ఆమె పీఆర్ టీమ్ ఈ వివరణ ఇచ్చింది.
2012 మార్చి 13న బేబీ పోలినా పుట్టిందంటూ రేణూ దేశాయ్ ఫేస్ బుక్ ఖాతాలో గుర్తు చేసిన ఈ బృందం, ఆ తరువాత నాలుగు రోజులకు అంటే, 2012 మార్చి 16న పవన్, రేణులు విడాకులు తీసుకున్నారని చెప్పారు. మార్చి 13న పోలినా పుట్టిందంటే, ఆమె తల్లి, ప్రస్తుత భార్య అన్నా లెజినోవా జూలై 2011లో గర్భం ధరించి వుంటుందని అన్నారు.
తాము ఈ వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న విషయాన్ని చెబుతూ, గత కొన్నిరోజులుగా రేణూ దేశాయ్ కి ఎన్నో మెసేజెస్ వస్తున్నాయని, ఇటీవల టీవీ న్యూస్ యాంకర్ స్వప్నతో వచ్చిన ఆమె ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుని పాప పుట్టిన తేదీ మరియు విడాకులు మీద కొంతమంది గందరగోళాన్ని సృష్టిస్తున్నారని చెప్పారు. అందుకే ఈ వివరణ ఇస్తున్నామని అన్నారు.