KCR: బీసీల జాబితాలోకి మరో 30 కులాలు... కేసీఆర్ కీలక నిర్ణయం!

  • అధ్యయన బాధ్యతలు ఎంపీ కేకే, సీఎస్ జోషిలకు అప్పగింత
  • చాలా దయనీయ స్థితిలో సంచార కులాలు
  • వెలుగులు తెస్తామన్న కేసీఆర్

తెలంగాణలో సంచార జాతుల్లో ఉన్న 30 కులాలను బీసీల జాబితాలో చేర్చాలని నిర్ణయించిన కేసీఆర్, దీనిపై అధ్యయన బాధ్యతలను ఎంపీ కే కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిలకు అప్పగించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ జాతులు గుర్తింపు పొందలేదని, చాలా దయనీయ స్థితిలో ఉన్న వీరి జీవితాల్లో వెలుగులు తెస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు.

ప్రగతి భవన్ లో జూలూరి గౌరీశంకర్ రచించిన 'బీసీ కులాలు - సంచార జాతులు' పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు. సారోళ్లు, అర్వకోమటి, తోలు బొమ్మలాట, కుల్లకిడిగి, టైల్‌ కమ్మర, అహీర్‌, గోవిలి, బాగోతుల, బొప్పాల, గంజికూటి, సారగాని, కడారి, ఓడ్‌, పాదం, సాధనాశూరులు, రుంజా, పనాస, పెక్కర, పాండవులవారు, గోడ జెట్టి, ఆది కొడుకులు, తెర చీరల, ఇనూటి, కాకి పడగల, మందహెచ్చుల, పప్పాల, సన్రాయిలు, బత్తిన, శ్రీక్షత్రియ, రామజోగి కులాల వారిని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News