France: పారిస్ లో రెచ్చిపోయిన ఫ్యాన్స్... తాటతీసిన పోలీసులు!

  • ఫుట్ బాల్ వరల్డ్ కప్ గెలవగానే సంబరాలు
  • లక్షల మంది వీధుల్లోకి చేరగా, సమస్యలు సృష్టించిన కొద్దిమంది
  • వ్యాపార సంస్థలపై దాడులు, పోలీసులపై రాళ్లవర్షం
  • టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

తమ దేశం విజయం సాధించిందన్న ఆనందంతో ఫ్రాన్స్ ఫుట్ బాల్ అభిమానులు రెచ్చిపోగా, వారిని అదుపు చేసేందుకు భారీఎత్తున పోలీసులు, భద్రతాదళాలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. నిన్న రాత్రి క్రొయేషియాతో జరిగిన మ్యాచ్ లో ఫ్రాన్స్ విజయం సాధించిన తరువాత పారిస్ వీధులు కేరింతలతో, నినాదాలతో నిండిపోయాయి. కొందరు అభిమానుల అత్యుత్సాహంతో గొడవలు జరిగాయి.

లక్షల మంది పారిస్ లోని ఈఫిల్ టవర్ దగ్గరకు చేరి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న వేళ, కొందరు పోలీసులతో గొడవ పడ్డారు. రహదారులపై ఉన్న వ్యాపార సంస్థలను, ఆస్తులను ధ్వంసం చేశారు. వారిని నిలువరించేందుకు లాఠీచార్జ్ చేసిన పోలీసులు, టియర్ గ్యాస్ ను కూడా ప్రయోగించారు. తమపై కొందరు ఫ్యాన్స్ రాళ్లు రువ్వారని, అందువల్లే తాము కఠినంగా వ్యవహరించామని పోలీసు అధికారులు వెల్లడించారు.

 కాగా, లక్షల మందిలో అతికొద్దిమంది సమస్యలు సృష్టించారని జరిగిన ఘటన, పోలీసుల చర్యలపై 'బీఎఫ్ఎం టీవీ' వెల్లడించింది. ఇదే తరహా ఘటనలు లియాన్ లోనూ జరిగాయని తెలిపింది. మరోపక్క, ఆదివారం నాటి సాకర్ ఫైనల్ తరువాత, ఫ్రాన్స్ గెలిచినా, ఓడినా అభిమానులను నిలువరించేందుకు ముందుగానే 1.10 లక్షల మంది పోలీసులను సిద్ధం చేసి, రహదారులపై మోహరించివుండటంతోనే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పకుండా చేశామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News