Chennai: ఎస్పీకే సంస్థపై ఐటీ దాడులు.. రూ.160 కోట్ల నగదు, 100 కిలోల బంగారం స్వాధీనం!
- ఏక కాలంలో 30 చోట్ల దాడులు
- భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం
- ఇంత పెద్ద మొత్తం దొరకడం ఇదే తొలిసారి
తమిళనాడులోని ఎస్పీకే సంస్థ కార్యాలయలంపై ఆదాయ పన్ను శాఖ జరిపిన దాడుల్లో కళ్లు చెదిరే ఆస్తులు, బంగారు ఆభరణాలు లభించాయి. విరుదనగర్ జిల్లా అరుప్పుకొట్టై, చెన్నైలోని పొయెస్ గార్డెన్, క్రోంపేట, బీసెంట్‌నగర్, అభిరామపురం, కోవిలంబాక్కం సహా 30 చోట్ల ఐటీ ఏక కాలంలో దాడులు నిర్వహించింది.
అదే సమయంలో ఎస్పీకే సంస్థ నిర్వాహకుల బంధువుల ఇళ్లపైనా దాడులు చేసింది. దాడుల్లో రూ.160 కోట్ల నగదు, 100 కిలోల బంగారం, 30 బ్యాంకు ఖాతాల వివరాలతోపాటు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఇంత పెద్దమొత్తంలో నగదు దొరకడం ఇదే తొలిసారి. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఎస్పీకే సంస్థ రోడ్డు కాంట్రాక్టు పనులు చేపడుతుంది.