manohar parikar: గోవాలో ఇక బహిరంగంగా మందు కొడితే.. భారీ జరిమానా!
- బహిరంగంగా మందుకొడితే రూ. 2,500 ఫైన్
- ఆగస్టు 15 నుంచి అమలు
- త్వరలోనే నోటిఫికేషన్
తెలుగు రాష్ట్రాల్లోని మందు ప్రియులు గోవాకు వెళ్లి ఎంజాయ్ చేయడం సాధారణ విషయమే. అయితే, ఇకపై గోవాకు వెళ్లేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో మందు తాగితే భారీ జరిమానా విధిస్తామని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ప్రకటించారు. రూ. 2500 ఫైన్ విధిస్తామని చెప్పారు. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుందని తెలిపారు. ఆగస్టు లోపే ఈ విధానాన్ని అమలు చేయాలనుకున్నామని... ఆగస్టు 15 నుంచి అమల్లోకి తెస్తామని చెప్పారు.
ఇటీవలే అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ ప్రాంతంలో కాలేజీ విద్యార్థులు బీర్లు తాగుతూ కనిపిస్తున్నారని పారికర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు బీరు బాటిల్స్ పట్టుకుని వెళ్తుండటాన్ని తాను చూశానని... ఖాళీ బాటిళ్లను ఎక్కడపడితే అక్కడ పడేయటం వల్ల మిగతా ప్రజలకు ప్రమాదాలు జరిగే అవకాశం వుందని అన్నారు.