Jagan: జగన్ పాదయాత్ర కాకినాడలోకి ప్రవేశిస్తున్న వేళ... డ్రోన్ వ్యూ!

  • కొవ్వాడ వద్ద భారీ కటౌట్
  • జగన్ కు ఘనస్వాగతం పలికిన ప్రజలు
  • చంద్రబాబు ఇంకా బీజేపీతో సంబంధం కొనసాగిస్తున్నారని విమర్శలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ 200 రోజులకు పైగా సాగిస్తున్న పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లా ముఖ్యపట్టణం కాకినాడలోకి ప్రవేశిస్తున్న వేళ తీసిన డ్రోన్ కెమెరా వ్యూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొవ్వాడ రహదారిపై రైలు పట్టాలు దాటగానే ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ కటౌట్ మధ్య నుంచి జగన్ వెళుతున్న వేళ తీసిన వీడియో ఇది. తనకు ఘన స్వాగతం చెబుతున్న ప్రజలు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు జగన్.

ఆపై కాకినాడలో జరిగిన బహిరంగ సభలో కిక్కిరిసిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, చంద్రబాబు, బీజేపీతో బయటకు యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తూ, లోపల నేతలతో కాళ్ల బేరానికి దిగారని విమర్శించారు. రైతులను మోసం చేయడంలో ఆయనే నంబర్ వన్ అని, ఏ హామీనీ ఆయన అమలు చేయలేదని ఆరోపించారు. "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" అవార్డును ఏపీ సర్కారుకు ప్రకటించిన వారికి బుద్ధుందా? అని ప్రశ్నించారు. హోదా విషయంలో తాము ఎవ్వరినీ నమ్మడం లేదని, మొత్తం 25 ఎంపీ సీట్లనూ వైకాపాకు ఇస్తే, ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News