raghuveera: రేపు ఏపీ వ్యాప్తంగా నిరసనలకు రఘువీరారెడ్డి పిలుపు
- లోక్సభలో రేపు అవిశ్వాస తీర్మానంపై చర్చ
- ఈ నేపథ్యంలో కేంద్రంపై రేపు నిరసనలు
- ఏపీ వ్యాప్తంగా మానవహారం నిర్వహించాలని పిలుపు
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంపై లోక్సభలో రేపు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజాస్వామ్యవాదులకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలు విషయంలో మోదీ ప్రభుత్వం ద్రోహం చేసిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలు, నగర కేంద్రాల్లో ‘మానవహారం’ ద్వారా కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేయాలని అన్నారు.