galla jayadev: అవిశ్వాస తీర్మానంపై చర్చలో గల్లా జయదేవ్ ప్రసంగం హైలైట్స్!

  • తెలంగాణకు ఆస్తులు, ఏపీకి అప్పులు ఇచ్చారు
  • ఈశాన్య రాష్ట్రాలతో సమానంగా ఏపీని చూస్తున్నారు
  • ఏపీని మోదీ మోసం చేశారు

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసంపై చర్చలో భాగంగా టీడీపీకి 13 నిమిషాలు కేటాయిస్తే... ఎంపీ గల్లా జయదేవ్ 58 నిమిషాల సేపు అనర్గళంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ, తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగంలోని హైలైట్స్ ఇవే...

  • ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో 'భరత్ అనే నేను' చిత్రంలో చూపించారు.
  • తీర్మానానికి మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.
  • అపనమ్మకం, ప్రాధాన్యతను ఇవ్వక పోవడం, న్యాయపరమైన డిమాండ్లు, ధర్మపోరాటం అనే నాలుగు అంశాలపై అవిశ్వాసం పెట్టాం. 
  • రాష్ట్ర విభజన తర్వాత ఆస్తులు తెలంగాణకు, అప్పులు ఏపీకి ఇచ్చారు.
  • హైదరాబాదులో అన్ని ప్రాంతాలవారు పెట్టుబడులు పెట్టారు. చివరకు ఆ నగరం తెలంగాణలో ఉండిపోయింది.
  • హైదరాబాదును కోల్పోవడం ద్వారా ఏపీ ప్రధాన ఆదాయ వనరును కోల్పోయింది.
  • 90శాతం జాతీయ సంస్థలు తెలంగాణలోనే ఉండిపోయాయి.
  • సమైక్యంగా ఉన్నప్పుడు ఏపీ అన్ని రాష్ట్రాలతో సమానంగా ఉండేది. ఇప్పడు అన్ని రాష్టాల కంటే వెనుకబడి ఉంది.
  • తలసరి ఆదాయం, పారిశ్రామిక, సేవల రంగాల్లో అట్టడుగున ఉంది.
  • కాంగ్రెస్ పార్టీ తల్లిన చంపి, బిడ్డను బతికించిందంటూ మోదీ చెప్పారు. ఆ పాపంలో బీజేపీకి కూడా సగం వాటా ఉంది.
  • పార్లమెంటులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీపై మోదీకి గౌరవం లేదా?
  • ఐదేళ్లు కాదు, పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని బీజేపీ సభ్యులే అప్పట్లో డిమాండ్ చేశారు.
  • ప్రత్యేక హోదా ఇవ్వొద్దని తామెన్నడూ చెప్పలేదని 14వ ఆర్థిక సంఘం తెలిపింది.
  • ఈశాన్య రాష్ట్రాలతో సమానంగా ఏపీని కేంద్ర ప్రభుత్వం చూస్తోందే తప్ప దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా కాదు.
  • పోలవరానికి ఇస్తున్న నిధులు విభజన చట్టంలోని సెక్షన్-90 కింద ఇస్తున్నవే.
  • విభజన చట్టంలో భాగంగానే ఏపీకి నిధులు ఇచ్చారు.
  • ఇవ్వాల్సిన నిధులన్నింటినీ ఇవ్వాల్సిందే. కేంద్ర ప్రభుత్వం మాకు ఉదారంగా సాయం చేయడం లేదు.
  • శివాజీ విగ్రహానికి రూ. 3వేల కోట్లు, పటేల్ విగ్రహానికి రూ. 3,500 కోట్లు ఇచ్చారు. అమరావతికి మాత్రం రూ. 1500 కోట్లు మాత్రమే ఇచ్చారు.
  • పోలవరంకు రూ. 58,600 కోట్లు ఇవ్వాల్సి ఉంటే... కేవలం రూ. 6వేల కోట్లు మాత్రమే ఇచ్చారు.
  • రూ. 1500 కోట్లతో రాజధానిని ఎలా నిర్మించాలి?
  • తిరుమల వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా హామీని మోదీ ఇచ్చారు.
  • ఏపీకి మోదీ మోసం చేశారు.

  • Loading...

More Telugu News