Sonia Gandhi: తల్లీ! రాష్ట్రాన్ని విభజించి.. రెడ్లకు తీరని అన్యాయం చేశావు!: సోనియాతో జేసీ
- లోక్ సభలో ఎంపీ జేసీకి ఎదురుపడ్డ సోనియాగాంధీ
- సోనియాకు నమస్కారం చేసిన జేసీ
- తనదైన శైలిలో సోనియాతో వ్యాఖ్యలు చేసిన జేసీ
లోక్ సభలో ‘అవిశ్వాసం’పై జరిగే చర్చకు ఎట్టి పరిస్థితిలోనూ హాజరయ్యే ప్రస్తకే లేదని చెప్పి.. చివరికి సీఎం చంద్రబాబు చేసిన ఫోన్ తో మెత్తబడ్డిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎట్టకేలకు ఈ చర్చకు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోక్ సభలో ఈ రోజు ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
సభలో జేసీ దివాకర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా సోనియాకు నమస్కారం చేసిన జేసీ, ఆసక్తిదాయక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ‘తల్లీ, రాష్ట్రాన్ని విభజించి.. రెడ్లకు తీరని అన్యాయం చేశావు. తెలుగు రాష్ట్రాల్లో ‘కాంగ్రెస్’ను నమ్ముకున్న రెడ్లు నిలువునా మునిగారు’ అని జేసీ అనడంతో సోనియా నవ్వుకుంటూ ముందుకెళ్లారట.