stock market: భారీ లాభాలను నమోదు చేసిన సెన్సెక్స్
- 88 వస్తువులపై తగ్గిన వస్తు, సేవల పన్ను
- రాణించిన ఎఫ్ఎంసీజీ రంగ షేర్లు
- 222 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలను నమోదు చేశాయి. 88 వస్తువులపై వస్తు, సేవల పన్నులను తగ్గించిన నేపథ్యంలో, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 222 పాయింట్లు పెరిగి 36,719కి చేరుకుంది. నిఫ్టీ 75 పాయింట్లు ఎగబాకి 11,085 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యూపీఎల్ (14.79%), పీసీ జువెలర్స్ (14.53%), ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ (9.95%), హ్యావెల్స్ ఇండియా (9.13%), గాడ్ ఫ్రే ఫిలిప్స్ (8.43%).
టాప్ లూజర్స్:
సౌత్ ఇండియన్ బ్యాంక్ (-17.15%), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ (-6.52%), ఎస్ఈఆర్ఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (-6.36%), హీరో మోటోకార్ప్ (-6.20%), బజాజ్ ఆటో (-5.35%).