chidambaram: చిదంబరంను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ పొడిగింపు
- ఎయిర్ సెల్- మ్యాక్సిన్ కేసు
- ముందస్తు బెయిల్ ఆగస్టు 7 వరకు పొడిగింపు
- ఢీల్లీ హైకోర్టు ఆదేశాలు
ఎయిర్ సెల్- మ్యాక్సిన్ కేసుకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రి చిదంబరంకు ఉపశమనం లభించింది. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా చిదంబరం ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ ను ఆగస్టు 7 వరకు పొడిగిస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది.
కాగా, గత గురువారం చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరంపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు విదేశీ కంపెనీలు భారత్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలోనే మలేషియాకు చెందిన ఓ కంపెనీ ఎయిర్ సెల్ కంపెనీలో పెట్టుబడి పెట్టిందనే ఆరోపణల నేపథ్యంలో చిదంబరంపై సీబీఐ కేసు నమోదు చేసింది.