Chandrababu: కేంద్రంపై పోరాడటం మానేసి.. ఈ బంద్ లు ఏమిటి?: చంద్రబాబు
- బంద్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది
- వచ్చే పెట్టుబడులు కూడా రాకుండా పోతాయి
- మన పోరాటం ప్రజలపై కాదు
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాడటం మానేసి... రాష్ట్ర బంద్ చేపట్టడమేమిటని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్ వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతారని అన్నారు. రాష్ట్రంలో అశాంతి వాతావరణం సృష్టిస్తే... వచ్చే పెట్టుబడులు కూడా రాకుండా పోతాయని మండిపడ్డారు. మన పోరాటం ప్రజలపై కాదని... అందరం కలసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులపై తాము చేసే పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
మరోవైపు ఈ ఉదయం టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజ్యసభలో విభజన హామీలపై జరిగే స్వల్పకాలిక చర్చపై ఈ సందర్భంగా ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని పెద్దల సభలో ఎండగట్టాలని సూచించారు.