gorati venkanna: పరిటాల రవి పట్టుబట్టడం వల్లనే ఆ పాట రాశాను: గోరటి వెంకన్న
- నగరజీవితానికి నేను కాస్త దూరమే
- రాయలసీమ ప్రాంతాల్లో తిరిగేవాడిని
- నాకు గల అవగాహన పాట రాయడానికి పనికొచ్చింది
తెలుగు జానపద సాహిత్యంపై కవిగా .. గాయకుడిగా తనదైన ముద్ర వేసిన గోరటి వెంకన్న, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆయన 'ననుగన్న నా తల్లి రాయలసీమ' అంటూ 'శ్రీరాములయ్య' సినిమా కోసం ఒక పాట రాశారు. ఈ విషయాన్ని గురించి అలీ ప్రశ్నించగా .. "మాది దక్షిణ తెలంగాణ .. కృష్ణానదికి ఓ 20 కిలోమీటర్ల ఇవతల మా ఊళ్లు ఉండేవి. అందువలన మొదటి నుంచి కూడా రాయలసీమతో మాకు దగ్గర అనుబంధం ఉండేది.
'ఈ పాట నువ్వే రాయాలి .. రాయకపోతే బాగుండదు' అంటూ పరిటాల రవి గారు పట్టుబట్టారు. నేనంటే ఆయనకి ప్రేమ .. ఆయనంటే నాకు గౌరవం. మొదటి నుంచి కూడా నగర జీవితానికి కాస్త దూరంగా వుండే తత్వం నాది. అందువలన మనసుకి ఏ మాత్రం బాధ కలిగినా నేను రాయలసీమకి వెళ్లేవాడిని .. అక్కడి ప్రాంతాలలో తిరిగేవాడిని. ఆ అవగాహన ఈ పాట రాయడానికి నాకు బాగా పనికొచ్చింది" అని ఆయన చెప్పుకొచ్చారు.