gorati venkanna: ఆడంబరాలు నచ్చవు .. సాధారణమైన జీవితమే ఇష్టం: గోరటి వెంకన్న
- పేదరికమంటే ఏమిటో తెలుసు
- నా కోసం పెద్దగా ఖర్చులు వుండవు
- ప్రశాంతంగా ఉండాలనుకుంటాను
గ్రామీణ నేపథ్యాన్ని .. మానవతా విలువలను తన గేయాల ద్వారా .. గీతాల ద్వారా చెప్పడం గోరటి వెంకన్న ప్రత్యేకత. తాను రాసిన పాటలను తనే పాడతారు .. తనే ఆడతారు కూడా. అలాంటి గోరటి వెంకన్న .. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు.
"ఆర్ధికంగా నేను ఎప్పుడూ ఇబ్బంది పడలేదు .. ఎందుకంటే నాది చాలా సాధారణమైన జీవితం. నాకు రూపాయి వస్తే పావలానే ఖర్చు అవుతుంది .. పది రూపాయలు వస్తే నాకోసం ఖర్చయ్యేది ఒక రూపాయే. ఎంత వచ్చినా ఎలా బతకాలనేది మా అమ్మానాన్నలు నాకు నేర్పారు. పేదరికం వున్నా .. ఆ తరువాత కాస్త డబ్బులు వచ్చినా జీవన విధానంలో పెద్దగా మార్పులేదు. ఎందుకంటే ఆడంబరాలు నచ్చవు .. పరిమితంగా .. ప్రశాంతంగా ఉండటానికే నేను ప్రాముఖ్యతనిస్తాను. ఉంటే వైకుంఠం .. లేదంటే ఊకుంటం .. అంటూ నవ్వేశారు.