gvl: ‘హోదా’పై బాధ్యత కలిగిన పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయి: జీవీఎల్ ఆరోపణ
- ‘హోదా’ అంశంపై అనేక అసత్యాలు ప్రచారం చేస్తున్నారు
- ప్రత్యేక ప్యాకేజ్ ను ఏపీ ప్రభుత్వం స్వాగతించింది
- ఇక ‘హోదా’ మాట ఎక్కడుంది?
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై బాధ్యత కలిగిన పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు.
విభజన హామీలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదా అంశంపై అనేక అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
కేవలం బీజేపీ వల్లే ఏపీకి నిధులు వస్తున్నాయని, ‘ప్రత్యేక హోదా’ అంటే కేవలం ఆర్థిక సాయమని టీడీపీకు తెలుసని, ప్యాకేజ్ తో ఇతర ప్రయోజనాలు కూడా అందుతాయన్న ఉద్దేశంతోనే నాడు దానికి అంగీకరించిందని అన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ ను ఏపీ ప్రభుత్వం అంగీకరించాక, ఇక ‘హోదా’ మాట ఎక్కడుంది? అని ప్రశ్నించారు. బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్ లో భాగంగా కృష్ణపట్నంలో 12 వేల ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఏపీ రాష్ట్రం కేవలం రెండు వేల ఎకరాలు మాత్రమే సేకరించిందని అన్నారు.