ap congress: నాపై రాజకీయ కక్షతో వల్లభనేని వంశీయే ఈ చీటింగ్ కేసు పెట్టించారు!: ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ
- వల్లభనేని వంశీపై ఆరోపణలు
- ఇప్పటికే, నాపై నాలుగు కేసులు పెట్టించారు
- వంశీ అక్రమాలకు పాల్పడుతున్నారు
ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీపై చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ, తనపై రాజకీయ కక్షతోనే చీటింగ్ కేసు నమోదు చేశారని, టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీయే ఈ చీటింగ్ కేసు పెట్టించారని ఆరోపించారు.
ఇప్పటికే, తనపై వంశీ నాలుగు కేసులు పెట్టించారని, తనపై కేసులు పెట్టించడమే వంశీ పని అని ఆమె మండిపడ్డారు. బ్రహ్మలింగేశ్వరస్వామి చెరువులో అక్రమంగా మట్టి తవ్వుకుంటూ వంశీ కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను బయటపెట్టినందుకే తనపై లేనిపోని కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు.