Bollywood: సినిమాల్లేక కష్టాలు పడుతున్న ముకేశ్ రుషి.. టీవీకి షిఫ్ట్!
- సినిమాలు తగ్గడంతో బుల్లితెరకు మారిన ‘విలన్’
- ‘పృథ్వీ వల్లభ్’ సీరియల్‌తో ప్రేక్షకుల ముందుకు
- విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు
విలన్ అంటే ఇలా ఉండాలి అనిపించే నటనతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హిందీ నటుడు ముకేశ్ రుషి (62) ప్రస్తుతం చేతిలో సినిమాల్లేక కష్టాలు పడుతున్నాడు. దీంతో బుల్లితెరకు షిఫ్టయ్యాడు. హిందీలో ‘పృథ్వీ వల్లభ్’ అనే సీరియల్లో నటిస్తున్నాడు.
శ్రీమంతుడు, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, పవర్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ముకేశ్ రుషి క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ సత్తా చాటాడు. కొన్ని హిందీ, పంజాబీ, భోజ్‌పురి సినిమాల్లోనూ నటించాడు. ఇటీవల తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసుగుర్రం సినిమాలోనూ నటించాడు. అందులోని కడప పెద్దిరెడ్డి పాత్ర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో అలరించిన రుషి ఇకపై బుల్లితెరపైనా కనిపించనున్నాడు. మరి మహిళా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో వేచి చూడాల్సిందే.