Chandrababu: కడప ఉక్కు పరిశ్రమను ‘కేంద్రం’ కట్టకపోతే మేమే కడతాం: సీఎం చంద్రబాబు
- ‘కేంద్రం’పై మండిపడ్డ చంద్రబాబు
- ఏపీకి రైల్వోజోన్ ఎందుకివ్వరు?
- రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేస్తాం
ఏపీలో రైల్వేజోన్, కడపలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఒంగోలులో నిర్వహించిన ధర్మపోరాట సభలో ఆయన మాట్లాడుతూ, కడప ఉక్కు పరిశ్రమను కేంద్రం కట్టకపోతే తామే కడతామని అన్నారు.
ఈ ఏడాదిలోనే రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేస్తామని, రాష్ట్రంలో అందరికీ సొంతిళ్లు కట్టించి ఇస్తామని, ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు కట్టాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, వెనుకబడిన వర్గాలను పూర్తిగా ఆదుకుంటామని చెప్పారు. ఎస్టీలకు భూములు కొని ఇస్తున్నామని, మైనార్టీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, మైనార్టీల హక్కులు కాపాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మైనార్టీలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, కాపుల రిజర్వేషన్ల కోసం కేంద్రానికి బిల్లు పంపించామని అన్నారు.