tsrtc: తెలంగాణ ఆర్టీసీ బస్టాండ్లలో 100 మినీ థియేటర్లు
- బస్టాండ్ ఖాళీ స్థలాల్లో థియేటర్లు
- చర్చించిన ఆర్టీసీ, ఎఫ్డీసీ చైర్మన్లు
- యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్న సోమారపు
తెలంగాణలోని ఆర్టీసీ బస్టాండ్ లు ఇకపై సినీ ప్రేక్షకులతో కిటకిటలాడనున్నాయి. బస్టాండ్ల పరిధిలో ఉన్న ఖాళీ స్థలాల్లో 100 మినీ థియేటర్లను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ, చలనచిత్ర అభివృద్ధి సంస్థలు సంయుక్తంగా నిర్ణయించాయి. టీఎస్ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎఫ్డీసీ చైర్మన్ పి. రామ్మోహన్ రావులు బస్ భవన్ లో సమావేశమై ఈ అంశంపై చర్చలు జరిపారు.
బస్ స్టేషన్లలోని ఖాళీ స్థలాల్లో మినీ థియేటర్ల నిర్మాణానికి అవసరమైన అనుమతులను ప్రభుత్వం నుంచి తీసుకుని, వెంటనే పనులు మొదలు పెట్టనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని సోమారపు తెలిపారు.