Mahankali: ఆలయానికి వచ్చిన స్వర్ణలత... కాసేపట్లో పచ్చి కుండపై నిలబడి భవిష్యత్తు చెప్పనున్న మాతంగి!
- మహంకాళి జాతరలో కీలకమైన ఘట్టంగా రంగం
- ఉదయం 9.30 గంటలకు భవిష్యవాణి
- ఇప్పటికే చేరుకున్న వేలాది మంది భక్తులు
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతరలో అత్యంత కీలకమైన ఘట్టంగా భక్తులు భావించే 'రంగం' మరికాసేపట్లో మొదలు కానుంది. మాతంగి స్వర్ణలత పచ్చి కుండపై నిలబడి రంగం వినిపించనున్నారు. ఉదయం 9.30 గంటలకు స్వర్ణలత, అమ్మవారిని తనలోకి ఆవహింపజేసుకుని భక్తులు అడిగే పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు.
ఆమె నోటి నుంచి భవిష్యత్తులో జరిగే పరిణామాలను, ముఖ్య విషయాలను వినేందుకు వేలాది మంది భక్తులు ఇప్పటికే ఆలయానికి చేరుకున్నారు. అమ్మ ప్రతినిధిగా ఆమె చెప్పే మాటలను భక్తులంతా వినడానికి వీలుగా ప్రత్యేక మైకులను ఏర్పాటు చేశారు. కాగా, కత్తికి మాంగల్య ధారణ చేసి, ఆజన్మాంతం అవివాహితగా మిగిలిపోయిన స్వర్ణలత, అమ్మవారికి ఆషాడ బోనాల జాతర ముగిసిన అనంతరం రంగం వినిపిస్తుందన్న సంగతి తెలిసిందే.