geetanjali: వీణ పాటలో నటించాలి .. నాకు వీణ వాయించడం రాదు: సీనియర్ నటి గీతాంజలి
- 'మురళీకృష్ణ'లో మంచి పాత్ర చేశాను
- పుల్లయ్యగారు పట్టుబట్టి వీణ నేర్పించారు
- అందువల్లనే ఆ పాట మంచి పేరు తెచ్చింది
తెలుగు తెరపై విభిన్నమైన పాత్రల ద్వారా మెప్పించిన అలనాటి నటీమణులలో గీతాంజలి ఒకరు. అలాంటి గీతాంజలి తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. "మురళీకృష్ణ' సినిమాలో మంచి పాత్ర చేశాను .. పి.పుల్లయ్య గారు దర్శకత్వం చేశారు. ఆయన కూతురు రాధ ఈ కథను రాసింది .. ఆమే చెప్పిందట నన్ను తీసుకోమని.
ఈ సినిమాలో 'మోగునా ఈ వీణ .. ' అనే పాట వుంది. నాకు వీణ వాయించడం రాదు .. అలాగని ఎలాపడితే అలా వీణ మీటడానికి పి.పుల్లయ్యగారు ఒప్పుకునేవారు కాదు. కొన్ని రోజుల పాటు మాస్టారును పెట్టుకుని నేర్చుకోమన్నారు. 'నాకు అంత సమయం లేదండి' అని నేను ఎంతగా చెప్పినా ఆయన వినిపించుకునేవారు కాదు. సంగీతం తెలిసిన వాళ్లు చూస్తే తప్పుబడతారు .. అందువలన కరెక్టుగా వీణ మీటాలి అనేవారు. అలా నాతో ప్రాక్టీస్ చేయించిన తరువాతనే ఆ పాట తీశారు గనుక అది నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది" అని చెప్పుకొచ్చారు.