Chandrababu: 'యువనేస్తం' ముందు తన పేరు వద్దన్న చంద్రబాబు!
- నిరుద్యోగ భృతి విధివిధానాలు ఖరారు
- చంద్రబాబు పేరు పెడదామన్న దేవినేని
- ప్రతి దానికీ తన పేరు సరికాదని వారించిన చంద్రబాబు
ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి విషయంలో, అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తరువాత విధివిధానాలను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసిన వేళ, ఈ పథకానికి తన పేరును పెట్టవద్దని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తన క్యాబినెట్ సహచరులతో సీఎం చర్చిస్తున్న వేళ, నిరుద్యోగ భృతికి ఏ పేరు పెట్టాలన్న విషయం ప్రస్తావనకు వచ్చింది. 'యువ నేస్తం' అని పెడదామని మంత్రి లోకేశ్ చెప్పడంతో 'చంద్రన్న యువ నేస్తం' అని పెడదామని మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు.
దీనికి స్పందించిన సీఎం, ప్రతి కార్యక్రమానికీ తన పేరును పెట్టుకుంటూ వెళ్లడం సరికాదని అనడంతో చివరకు 'ముఖ్యమంత్రి యువ నేస్తం' అని పేరు పెట్టారు. నిరుద్యోగ భృతి అమలుపై అవసరమైన వివరాలన్నీ సమగ్రంగా ఉన్నాయని, ఎవరు ఎక్కడ చదివారు?, ఏ కుటుంబంలో ఎవరున్నారు? ఎక్కడ పనిచేస్తున్నారు? తదితర వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నాయని ఈ సందర్భంగా లోకేశ్ వ్యాఖ్యానించారు.