india: టీమిండియాకు షాక్.. దినేష్ కార్తీక్ ఔట్
- టీమిండియాను దెబ్బతీసిన ఆండర్సన్
- తొలి ఓవర్ చివరి బంతికి కార్తీక్ ఔట్
- కోహ్లీకి జత కలిసిన పాండ్యా
ఇండియా, ఇంగ్లండ్ ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. మ్యాచ్ ను గెలిచేందుకు భారత్ కు 84 పరుగులు, ఇంగ్లండ్ కు 5 వికెట్లు అవసరమైన తరుణంలో ఈరోజు మ్యాచ్ ప్రారంభమైంది. కానీ తొలి ఓవర్ లోనే భారత్ ను ఆండర్సన్ దెబ్బతీశాడు. 18 పరుగులతో దినేష్ కార్తీక్, 43 పరుగులతో కోహ్లీ ఈరోజు బ్యాటింగ్ ను ప్రారంభించారు.
ఆండర్సన్ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికి కార్తీర్ 2 పరుగులు సాధించాడు. ఓవర్ చివరి బంతి కార్తీక్ బ్యాట్ ను ముద్దాడి, సెకండ్ స్లిప్ లోకి వెళ్లింది. ఈ సారి మాత్రం ఎలాంటి తప్పు చేయకుండా డేవిడ్ మలాన్ క్యాన్ ను అందుకున్నాడు. దీంతో భారత్ ఆదిలోనే కార్తీక్ (20) వికెట్ కోల్పోయి ప్రమాదంలో పడిపోయింది.
అనంతరం కోహ్లీకి పాండ్యా జత కలిశాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 117 పరుగులు. కోహ్లీ 45, పాండ్యా 3 పరుగులతో ఆడుతున్నారు. భారత్ విజయానికి మరో 77 పరుగులు అవసరం. నిన్న కోహ్లీ ఇచ్చిన రెండు క్యాచ్ లను మలాన్ అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే.